ఆ ఒక్క పని చేస్తే చాలు... నరఘోష పీడ విరగడైపోతుంది (Video)

cow2
సిహెచ్| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:29 IST)
నరఘోష. అంటే ఒకరు ఉన్నతిని చూసి మరొకరు బాధపడటం.. కొన్నిచోట్ల పెద్దలు చెప్పినట్లుగా ఏడవడం. ఇలా ఒకరు వృద్ధి చెందుతుంటే ఇరుగుపొరుగు లేదా బంధువుల్లో కొందరు అసూయ, ద్వేషంతో ఏడవడం వల్ల ఏర్పడుతుందనీ, దానివల్ల కుటుంబంలో వారికి కష్టనష్టాలు సంభవిస్తాయని పెద్దలు చెపుతుంటారు. ఈ నరఘోషను వదిలించుకునేందుకు చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం, దిష్టి వినాయకుడు ఫోటోలు పెట్టుకోవడం చేస్తుంటారు.

ఐతే వీటితో పాటుగా ఇంకొక్క పని చేస్తే నరఘోష అనేది పటాపంచలవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఆ పని ఏమిటంటే.. బంగాళా దుంపలు తీసుకుని వాటిని కాస్త ఉడికించి ఆ తర్వాత వాటి తొక్కు తీయాలి. అలా తీసిన ఆ బంగాళా దుంపలను సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు గోవుకి పెట్టాలి. ఇలా ఆదివారం లేదా గురువారం చేయాలి. నెలకి ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. నరఘోష పీడ విరగడైపోతుంది.

ఐతే ఆవుకి బంగాళా దుంపలు పెట్టేనాడు ఇంట్లో నాన్-వెజ్ చేయకుండా వుంటే మంచిది. ఇలా గోవుకి బంగాళా దుంపలు పెట్టడం వల్ల మేలు జరుగుతుంది.





దీనిపై మరింత చదవండి :