శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (10:01 IST)

శ్రావణ సోమవారం- ప్రదోష వ్రతం.. బిల్వ పత్రాలతో అర్చన మరిచిపోవద్దు...

Lord shiva
Lord shiva
శ్రావణ మాసం ముగియబోతోంది. ఈ సంవత్సరం, శ్రావణ మాసం చివరి ప్రదోష వ్రతం 28 ఆగస్టు 2023 సోమవారం నాడు. శ్రావణ మాసం సోమవారం.. ప్రదోష వ్రతం రెండూ కలిసి వచ్చాయి. ఈ రెండు ఉపవాసాలు శివునికి అంకితం చేయబడ్డాయి. దీనితో పాటు పుత్రదా ఏకాదశి వ్రతం కూడా ఈ రోజున వచ్చింది. 
 
శ్రావణ మాసం చివరి ప్రదోష వ్రతం సోమ ప్రదోష వ్రతం అవుతుంది. ప్రదోష వ్రతం రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం, సర్వార్థ సిద్ధ యోగం, రవి యోగాల శుభ కలయిక ఉంది. సౌభాగ్యయోగంలో ప్రదోష శివపూజ ఉంటుంది. 
 
ప్రదోష వ్రతం అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. దీంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. త్రయోదశి తిథి నాడు, సూర్యాస్తమయం తర్వాత మహాదేవుని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజు రుద్రాభిషేకానికి చాలా పవిత్రమైనది.  
 
సోమవారం నాడు ప్రదోష వ్రతం పాటించడం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం సోమవారం ప్రదోష వ్రతం. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. 
 
ఈ రోజున మహాదేవుని పంచకవ్యంతో పూజించడం ద్వారా పిల్లల కోరిక నెరవేరుతుంది. ఈ రోజున, పాలతో అభిషేకం చేసిన తరువాత, శివలింగానికి పూల మాల సమర్పించాలి. 
 
ప్రదోష వ్రత పూజ విధి: బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. అప్పుడు శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఉపవాసం వుండాలి. సాయంత్రం, సూర్యాస్తమయం తరువాత, ప్రదోషకాలంలో నియమ నిబంధనల ప్రకారం శివునిని పూజించాలి. 
 
పాలు, పెరుగు, గంగాజలం, తేనె, నీటితో శివుడికి అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలతో అర్చించాలి. ఆపై మనస్సులోని కోరికను ఆయనకు విన్నవించాలి. శివ తాండవ స్తోత్రం లేదా శివ అష్టక స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు.