1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 మే 2015 (19:07 IST)

లక్ష్మీదేవిని పూజిస్తే చాలు.. నారాయణుడి అనుగ్రహమూ లభించినట్టే..!

లక్ష్మీదేవిని పూజిస్తే చాలు.. నారాయణుడి అనుగ్రహమూ లభించినట్టేనని పండితులు అంటున్నారు. ఏ గుమ్మంలో రంగవల్లులు, పచ్చని తోరణాలు, పసుపు, కుంకుమలు కనిపిస్తాయో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఇల్లు మాదిరిగానే పూజా మందిరం కూడా కళకళలాడుతూ కనిపిస్తే.. లక్ష్మీదేవి, నారాయణుడు అక్కడే నివాసముంటారని విశ్వాసం. 
 
లక్ష్మీదేవి ఎక్కడైతే వుంటుందో అక్కడికి నారాయణుడు తరలివస్తాడు. ఇక లక్ష్మీదేవిని పూజిస్తూ వుండటం చూసి నారాయణుడు సంతోషపడతాడు. ఆ స్వామిని ఆరాధిస్తూ వుంటే అమ్మవారు ఆనందపడుతుంది. ఆ ఇద్దరికీ శుక్రవారం రోజున పూజాభిషేకాలు జరపడం వలన లక్ష్మీనారాయణులు మరింత ప్రీతిచెందుతారు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వలన జీవితంలో స్థిరపడటం జరుగుతుంది. లక్ష్మీదేవి చల్లని దయవలన సంపదలు పెరుగుతాయి. సౌభాగ్యం రక్షించబడుతుంది.
 
ఎవరైతే లక్ష్మీనారాయణులను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వుంటారో, వారిని ఆ స్వామి వాహనమైన గరుత్మంతుడు కూడా కనిపెట్టుకుని వుంటాడు. గరుత్మంతుడి అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజవంతంగా పూర్తవుతాయి. ఇలా లక్ష్మీనారాయణులను సేవిస్తూ వుండటం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, ఒడిదుడుకులు లేని జీవితం లభిస్తుందని పండితులు అంటున్నారు.