గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (12:16 IST)

శ్రీరామ నవమి.. రాములోరికి పానకం-వడప్పు.. తయారీ ఇదో

Panakam_Vadapappu
చైత్ర మాసం శుక్ల పక్ష నవమిలో రామ నవమి పండుగ జరుపుకుంటారు. త్రేతాయుగంలో రావణుడి దురాగతాలను అంతం చేయడానికి శ్రీ రాముడిగా అవతరించాడు. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
 
ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 21, మధ్యాహ్నం 12:43 నిమిషాలకి మొదలయింది. అప్పటి నుంచి ఏప్రిల్ 22, 2021 న రాత్రి 12:35 తో ముగుస్తుంది. ఈ రోజున స్వామికి పానకం, వడపప్పు సమర్పించాలి. ఈ రెండు పదార్థాలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
పానకం తయారీకి కావలసిన పదార్థాలు :
బెల్లం - 3 కప్పులు
మిరియాల పొడి - 3 టీ స్పూన్లు,
ఉప్పు : చిటికెడు,
నీరు : 9 కప్పులు
శొంఠిపొడి : టీ స్పూన్,
యాలకుల పొడి : టీ స్పూన్
 
తయారీ విధానం :
ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచుకుని తర్వాత నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి వేసి బాగా కలపాలి. అంతే రాముడికి నైవేద్యం పెట్టడానికి పానకం రెడీ అయ్యినట్లే..
 
వడపప్పు తయారీకి కావలసిన పదార్థాలు:
పెసరపప్పు- కప్పు,
పచ్చిమిర్చి- 1 (చిన్నముక్కలు)
కొత్తిమీర తరుగు- టీ స్పూన్,
కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్,
ఉప్పు- తగినంత
 
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి. ఒక నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ అయినట్లే. పానకం, వడపప్పుని శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి.. భక్తులకు వితరణ చేయాలి.