శ్రీరామ నవమి రోజున ఇలా చేయడం మరిచిపోకండి..
శివ భక్తుడైన అగస్త్య మహర్షి సుతేష్ణ మహర్షి శ్రీరామ నవమి గురించి వెల్లడించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను. అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను. చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను.
కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పఠించి, జాగారణముచేసి మరునాడు భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి, గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను.
ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకములందు భోగమును, మోక్షమును కలిగించునది.
ఆ రోజున రామనామ జపము చేయాలి. శ్రీరామ మూల మంత్రం ' శ్రీ రామరామారామ' అనే మంత్రాన్ని ఉచ్ఛరించాలి. ఏదీ చేయకపోయినా శ్రీరామనవమి రోజున ఉపవాసము ఉండి శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. అని అగస్త్య మహర్షి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి.