త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?
నవ గ్రహాలలో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారు. ఈ సూర్యుడు మకరరాశి నుంచి కుంభంలోకి సంచరించనున్నాడు. ఈ సంచారం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 14వ తేదీ వరకు వుంటుంది. అలాగే ఈ సమయంలో ఇదే రాశిలో శనిదేవుడు ఆధిక్యంలో వుంటాడు.
అంతేకాదు బుధుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ త్రిగ్రాహి యోగం వల్ల మేషరాశికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.
అలాగే మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వుంటాయి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహ రాశి నుంచి ఏడో స్థానం నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
అదేవిధంగా కన్యారాశి వారికి కూడా ఈ త్రిగ్రాహి యోగం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. వ్యాపారులకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందొచ్చు. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. తులా రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.