జుట్టు రాలినట్లు కలలో కనబడితే.. స్వీట్లు, పాయసం, అద్దాలు కలలో కనిపిస్తే?

రాత్రిపూట నిద్రించేటప్పుడు వచ్చే కలలు కొన్ని సంకేతాలను సూచిస్తాయట. సాధారణంగా కలలో ఏవేవో దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిలో కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయేవి సూచిస్తాయట. కలలో ప్రకాశించే సూర్యుడు కనిపిస్త

Selvi| Last Updated: గురువారం, 25 మే 2017 (16:18 IST)
రాత్రిపూట నిద్రించేటప్పుడు వచ్చే కలలు కొన్ని సంకేతాలను సూచిస్తాయట. సాధారణంగా కలలో ఏవేవో దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిలో కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయేవి సూచిస్తాయట. కలలో ప్రకాశించే సూర్యుడు కనిపిస్తే త్వరలో ధనప్రాప్తి చేకూరుతుందట. చంద్రుడు కలలో కనిపించినా ధనప్రాప్తికి సంకేతమిచ్చినట్లేనని పండితులు అంటున్నారు.

అలాగే కలలో జుట్టు రాలినట్లు కలవస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. ఇంకా అలంకారం చేసుకున్నట్లు కానీ, మన ముఖం అందంగా కనబడినా.. లేదంటే మనిపర్సు కనిపించినా ధనం లభిస్తుందని అర్థం చేసుకోవాలి.

ఆవు పాలిచ్చినట్లు కలలో కనబడితే సంపన్నులు అవుతారట. ఇక కలలో బంగారం కనబడినా.. బంగారం ధరించినట్లు కల వచ్చినా లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లేనని పండితులు చెప్తున్నారు. పగిలిన అద్దాలు కాకుండా.. ప్లెయిన్‌గా అందంగా ఉండే అద్దాలు కలలో దర్శనమిస్తే.. తప్పకుండా ధనవంతులవుతారట. అదేవిధంగా కలలో పాయసం, ఏదైనా స్వీట్లు కనిపిస్తే ధనవంతులవుతారని పండితులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :