బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (08:48 IST)

ఫాల్గుణ పౌర్ణమి వ్రతం.. ఉపవాసం చేస్తే ఎంత మేలంటే? (video)

ఫాల్గుణ పౌర్ణమి రోజున పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను నిష్ఠగా పూజించాలి. అలాగే కుమార స్వామిని-దేవయానిని, రాముడు-సీతను దంపతుల సమేతంగా పూజించడం ద్వారా వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. 
 
పౌర్ణమి రోజున్న అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రం పూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 
 
ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసే వారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా శరీర మెటబాలిజం నియంత్రించబడుతుంది. జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. పూర్తి మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా సెలవిస్తున్నారు.