శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (19:27 IST)

29-03-2020 నుంచి 04-04-2020 వార ఫలితాలు

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్ని తెగేవరకు లాగొద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. చాకచక్యంగా వ్యవహరించాలి. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు రూపొందించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల కోసం ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహం ప్రశాతంగా ఉంటుంది. పెట్టుబడుల తరుణం కాదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉత్సాహంగా గడుపుతారు. మీ జోక్యం అనివార్యం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానంపై దృష్టిపెడతారు. ఏజెంట్లను విశ్వసించవద్దు. బంధువులు కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఊహించని సంఘటనలెదురువుతాయి. మంగళ, బుధవారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతనవుండవు. పెరిగిన ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సంప్రదింపులు ఫలించవు. ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిస్తేజానికి లోనవుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొడిగా పూర్తిచేస్తారు. గురువారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకుంటారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా మెలగండి. పంతాలకు పోవద్దు. శుక్ర, శనివారాల్లో పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అవగాహనా లోపం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వివాయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. స్తోమతకు మించి హమీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుతుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టిసారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పత్రాలు రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆదివారం నాడు ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు. కళ, క్రీడా రంగాలవారికి ప్రోత్సాహం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచాయాలేర్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షింకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధికమిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో సమస్యలెదురవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. బుధవారంనాడు కావలసిన పత్రాలు కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ  పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ వారం ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రకటనలు సందేశాలను విశ్వసించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు ఆన్వేషిస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఆప్తులను కలిసివస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. వారి ఇష్టానికి అనువుగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
వ్యాపకాలు అధికమవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. పరిచయాలు బలపడతాయి. మాట నిలబెట్టుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. యాధృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
సంతానం విషయంలో శుభపరిణామాలుంటాయి. వేడుకలకు హాజరవుతారు. కొత్త పరిచాయాలేర్పడతాయి. లక్ష్యసాధనకు ఏకాగ్రత ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. సన్నిహితుల మీపై మంచి ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో ముందుకుసాగుతారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. కొంత మొత్తం ధనం అందుతుంది. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కావలసిన పత్రాలు కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభద్ర, రేవతి
హామీలు నిలబెట్టుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆది, సోమవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్తత. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు అంతతమాత్రంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మార్కెట్ రంగాలవారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.