ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (21:51 IST)

08-03-2020 నుంచి 14-03-2020 వరకు మీ వార రాశిఫలాలు- video

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహారనుకూలత ఉంది. వ్యూహాత్మకంగా అడుగు వేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మొండిగా పనులు పూర్తిచేస్తారు. శనివారంనాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. అంచనాలు ఫలించవు. ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు చేబదుళ్లు స్వీకరిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. మంగళ, బుధవారాల్లో ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితులు మీపై సత్ప్రభావం చూపుతుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మొండిగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వ్యాపారాలు సంక్రమంగా పుంజుకుంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష. 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అనుకూలతలున్నాయ. ప్రేమానుబంధాలు బలపడతాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో ఉహించని సంఘటనలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలవుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. అధికారులకు హోదా, మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. శనివారం నాడు అనుకోని ఖర్చులుంటాయి. ధనంమితంగా వ్యయం చేయడి. శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. మీ శ్రీమితి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు అనుకూలం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
సర్వత్రా అనుకూలతలున్నాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏ సంబంధం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టిపెడతారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు ఆకస్మిక స్థానంచలనం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆత్మీయుల క్షేమసంచారం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. జూదాలు, బెట్టింగ్‌లు జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మంగళ, బుధవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రముఖుల సందర్శనీయం వీలుడపదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం అందుతుంది. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహిచండి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సంతానం మొండివైకరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గురు, శుక్రవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంద. మనోధైర్యంతో ముందుకుసాగుతారు. పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. శని, ఆదివారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహమార్పు కలిసివస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వేడుకలకు హాజరవుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. ఖర్చులు, అధికం. ప్రయోజనకరం. వివాహ సంబంధ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువుల వ్యాఖ్యలు పట్టుదలను పెంచుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రకటనలు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ వారం ఆశాజనకం. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అమరికలు తగవు. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులకు సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రుణ విముక్తులవుతారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.