బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (17:07 IST)

15-03-2020 నుంచి 21-03-2020 వరకు మీ వారఫలాలు

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
బంధువులతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శనివారం ఖర్చులు విపరీతం. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. విద్యా సంస్థల తాకిడి అధికంగా ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులక కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం విశ్రాంతి లోపం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. దళారులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. రుణ విముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అనుకోని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు ముగింపుదశలో మందకొడిగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మున్ముందు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. రుణ ఒత్తిళ్లు అధికం. రాబడిపై దృష్టిపెడతారు. ఆత్మీయుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. బుధ, గురువారాల్లో గుట్టుగా వ్యవహరించండి. ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి అధికం. శనివారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారిపట్టించే ఆస్కారం ఉంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శ్రమించినా ఫలితం శూన్యం. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడును ఘనంగా చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
రుణ సమస్యలు విముక్తులవుతారు. గృహం ప్రశాంతత ఉంటుంది. ఖర్చులు సామాన్యం. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాయిదాపడిన పనులు పూర్తికాగలవు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆది, సోమవారాల్లో అనవసర జోక్యం తగదు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీలు. అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యవహారనుకూలత ఉంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదువులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈవారం అనుకూలదాయకం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. గుట్టుగా వ్యవహరించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. మీ యిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను నమ్మవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాలకు సాయం అందిస్తారు. వత్రాలు సమయానికి కనిపించవు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆడిటర్లు, మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక సాధ్యంకాదు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
శుభకార్యానికి హాజరవుతారు. ఆత్మీయుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అంచనాలు నిరుత్సాహపరుస్తారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఊహించని సమస్యలెదురవుతాయి. దంపతుల మధ్య అమరికలు తగవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమకు అధికం. విద్యార్థులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వ్యవహారానుకూలత ఉంది. మీ కష్టం వృధా కాదు. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలపై దృష్టిపెడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరం. సంతానం చదువులపై దృష్టిపెడతారు. మంగళ, బుధవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు ప్రణాలికలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. సత్కారాలు అందుకుంటారు.