ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (23:16 IST)

తెల్ల ఆవాలు, ఉల్లి, వెల్లుల్లి తొక్కలు, సాంబ్రాణితో ధూపం వేస్తే? (video)

తెల్ల ఆవాలతో యాగం చేయడం ద్వారా దుష్ట శక్తులు ఇంటి నుంచి తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అంతేగాకుండా ఇంట్లో ధూపాన్ని వేసే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేస్తే.. ఇంట్లో ప్రతికూల ఫలితాలు సైతం వైదొలగుతాయి. 
 
తెల్ల ఆవాలు, ఉల్లి, వెల్లుల్లి తొక్కలు, సాంబ్రాణి కలిపి.. మంగళవారం, గురువారం, ఆదివారం పూట సాంబ్రాణితో కలిపి ధూపమెలిగిస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి.. సానుకూల ఫలితాలుంటాయి. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. నరదృష్టి తొలగిపోతుంది. 
 
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఈ వస్తువులు కాలుకి తగలకుండా జాగ్రత్త పడాలి. ఈ వస్తువులకు దైవాత్మిక శక్తి వుంటుంది. వీటితో పాటు తెల్ల ఆవాలు, గోరింటాకు గింజలు, సాంబ్రాణి, బిల్వ పత్రాల పొడి, వేపాకు పొడి, గరిక పొడిని కలిపి కూడా ధూపం వేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది. 
 
వేపాకు శక్తి మాతకు, గరిక వినాయకునికి ప్రీతికరం. ఇలాంటివి అగ్నిలో వేయడం ద్వారా దుష్ట శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.