చంద్ర గ్రహం ప్రాముఖ్యత ఏంటి? దోషం వుంటే ఏం చేయాలి? (video)

సిహెచ్| Last Updated: శనివారం, 11 జులై 2020 (20:02 IST)
నవ గ్రహాల్లో రెండవవాడు చంద్రుడు. తెలుపు రంగులో వుంటాడు. సోమవారం ప్రశస్తి. ఈయన నాలుగు చేతులు కలిగి వుంటాడు. రెండు చేతులలో గద, పద్మం వుంటాయి. రెండు చేతులు అభయవరముద్రలతో వుంటాయి. ఈయన శిరస్సున స్వర్ణకిరీటం, మెడలో ముత్యాలమాల ధరించి వుంటాడు. తెల్లని పది అశ్వాలతో రథాన్ని కలిగి వుంటాడు.


పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు ఈయన వచ్చాడని పురాణాల వాక్కు. విష్ణుమూర్తి హృదయం నుండి వచ్చాడని వేదాల మాట. శివునికి ఎడమ కన్ను శిరస్సు ఆభరణంగా విరాజిల్లుతుంటాడు. ఇతని తల్లిదండ్రులు అత్రి, అనసూయలు. ఇతని భార్య రోహిణి దేవి. ఇతనికే చంద్రమసుడు, శశి, సోమ, నిలవు అనే పేర్లు కూడా వున్నాయి.

చంద్రగ్రహ దోషం వున్నవారు తెల్లని ముత్యాన్ని ధరించాలి. శక్తి దేవతకు తెల్లని పువ్వులతో అర్చన చేయించాలి. పేదవారికి తెల్లటి వస్త్రాలు, బియ్యాన్ని దానం ఇవ్వాలి. ఈయన దేవాలయంలో ఐదు లేదా తొమ్మిది దీపాలు వెలిగించాలి. పాయసాన్ని నివేదించాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషం తొలగి పంటలు బాగా పండి, ఆనందం, కీర్తి మంచి కంటిచూపు కలుగుతాయి. వీరి దేవాలయాల్లో తింగళూరులో వున్నది అత్యంత ప్రసిద్ధమైనది.

దీనిపై మరింత చదవండి :