మోసం చేయడం కంటే...?

Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:27 IST)
ఒకరోజు.. డబ్బు, ప్రతిష్ట అన్నీ కోల్పోవచ్చు. మీ మనసులో ఉండే సంతోషం తగ్గవచ్చు. కానీ మీరు బతికున్నంత కాలం అంది బతికి ఉంటుంది. తిరిగి మిమ్మల్ని మళ్లీ సంతోషపెట్టడానికి.. బతికి ఉన్న మనుషుల కంటే.. చనిపోయినవాళ్లకే పువ్వులు ఎక్కువ వస్తాయి. బతికున్నప్పుడు అసలు గుర్తించబడని మనిషి.. చనిపోయిన తరువాత కీర్తింపబడతాడు. కారణం.. కృతజ్ఞతకంటే పశ్చాత్తాపానికే బలమెక్కువ.

1. సుఖదుఃఖాలు ఒకే నాణానికున్న బొమ్మా బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే, దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం.

2. ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు.

3. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం కంటే మిన్న.

4. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడగలగడం నిజమైన నేర్పరితనం.

5. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం.దీనిపై మరింత చదవండి :