శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (12:56 IST)

ఇష్టం ఉంటే.. కోపానికి కూడా ఓ అర్థం ఉంటుంది..?

1. కదలని బొమ్మకు కవితలు చెప్పినా..
మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.
 
2. ఇష్టం ఉంటే.. కోపానికి కూడా ఓ అర్థం ఉంటుంది..
ఇష్టం లేకుంటే.. నిజమైన ప్రేమ కూడా అర్థంలేకుండా పోతుంది..
 
3. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే...
ఇప్పుడెందుకులే అనే బద్దకం ఉంటే.. ఏదైనా అసాధ్యమే..
 
4. విజయాని కంటే.. దానికోసం చేసే ప్రయత్నం..
చాలా గొప్పది..
 
5. జీవితమంటే ఒక సమస్యనుండి మరొక సమస్యకు ప్రయాణించడమే..
ఏ సమస్య లేని జీవితం అంటూ ఉండదు.
 
6. జీవితమనే వృక్షానికి కాసేపండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు,
స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు లాంటి వాళ్ళు..
పండ్లు లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో కానీ..
వేర్లు లేకపోతే బ్రతకలేదు...