భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!

annapurna
సిహెచ్| Last Modified శుక్రవారం, 29 నవంబరు 2019 (21:27 IST)
నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ!
నిర్దూతాఖిల లోకపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ!
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ!
భిక్షాందేహి! కృపావలంబనకరీ! మాతా అన్నపూర్ణేశ్వరీ!

కోరిన వరాలిచ్చి శాశ్వతమైన ఆనందాన్ని, అభయాన్ని ఇచ్చేటువంటి అమ్మా నీవు సౌందర్యరాశివి. సమస్త దోషాలను పోగొట్టి పవిత్రత కలిగించేదానివి. మహేశ్వరుని రాణివి. హిమవంతుని వంశమును పునీతం చేసిన దానవు. దయకు నిలయమైన తల్లివి అయిన ఓ అన్నపూర్ణేశ్వరీ... నాకింత భిక్షపెట్టు!దీనిపై మరింత చదవండి :