గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (12:41 IST)

పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టుగా కలలు వస్తే...

చాలా మంది యువతీ యువకులు పెళ్లికి ముందు ప్రేమలో పడుతుంటారు. వీరిలో చాలా మంది వివాహం చేసుకున్న తర్వాత కూడా వారు తమ ప్రేమ నుంచి బయటపడలేక పోతుంటారు. ముఖ్యంగా పాత ప్రియుడితో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి

చాలా మంది యువతీ యువకులు పెళ్లికి ముందు ప్రేమలో పడుతుంటారు. వీరిలో చాలా మంది వివాహం చేసుకున్న తర్వాత కూడా వారు తమ ప్రేమ నుంచి బయటపడలేక పోతుంటారు. ముఖ్యంగా పాత ప్రియుడితో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటుంటారు. అంతేకాకుండా, రాత్రివేళల్లో పెళ్లికి ముందు ఉన్న ప్రియుడుతో సెక్స్ చేస్తున్నట్టు కలలు కంటుంటారు. ఇలాంటి సమస్యలను మానసిక వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే... 
 
మానవ ప్రవర్తనలో ఇది అత్యంత సహజం. అతన్ని పెళ్లి చేసుకోలేకపోయారు కాబట్టి అతనైతే ఎలా ఉండి ఉండేది? అని అనుకోవటం, రాత్రివేళ అందుకు సంబంధించిన ఆలోచనలు రావటం, ఊహలు కలగటం సాధారణమే. అయితే, ఆ ఆలోచనల వల్ల భర్త మీద అయిష్టత ఏర్పడకుండా ఉండాలి. అలాగే సంసార జీవితంలో దంపతుల మధ్య ఉండే సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి. అదేసమయంలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు.