బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:02 IST)

తిరుమల శ్రీవారి ముందే తొమ్మిది మంది దారుణ హత్య... హత్య చేసింది ఎవరు!

పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిది మంది. స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగరరాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిది మంది అర్చ

పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిది మంది. స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగరరాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిది మంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు. నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని హత్యచేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహాపాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నేండేళ్ళ పాటు భక్తులెవర్ని ఆలయంలోకి అనుమతించలేదట. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.
 
ఆ పన్నెండేళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టును దర్శించుకునే భాగ్యం కలుగలేదు. కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వరస్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వరస్వామిని ఇప్పటికీ భక్తి శద్ధలతో దర్శించుకుంటుంటారు.
 
తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండిపూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
 
అయితే ఇలాంటి ప్రచారం జరుగుతుండడంతో అర్చకులు విచారం వ్యక్తంచేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే బ్రిటీష్‌ ప్రభుత్వ కాలంలో 31-07-1801 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కైంకర్యపట్టీలను చూస్తే అందరికీ అర్థమవుతుందని అర్చకులు చెబుతున్నారు. అయితే అర్చకుల వాదన కన్నా విమాన వేంకటేశ్వరస్వామి చరిత్ర గురించే ప్రజల్లోకి ఎక్కువగా వెళుతోంది.