Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి పండగ ఎన్ని రోజులు జరుపుకుంటారు?

Written By ఠాగూర్
Updated: గురువారం, 4 నవంబరు 2021 (08:46 IST)
ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు. దీనిని యమ దీపం అంటారు. 
 
ఈ దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే యమ దీపం పెడుతుంటారు. నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమావాస్య మర్నాడు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ నాడు యమ ద్వితీయగా చేసుకుంటారు. ఆనాడు అన్నాదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలనే నియమం ఉంది. ఏడాదికి ఒకసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది. 

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

తర్వాతి కథనం
Show comments