సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:10 IST)

దేశంలో కనిష్ఠానికి క్రియాశీల కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 10,68,514 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మందురోజు కంటే కేసులు 14 శాతం మేర పెరిగాయి. నిన్న 311 మంది మరణించారు. ఒక్క కేరళలో 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరగా.. 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక నిన్న 14,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం 1,51,209 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసులు 252 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఆ రేటు 0.44 శాతం తగ్గగా.. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది.

గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల, రికవరీ రేట్లు సానుకూలంగా నమోదవుతున్నాయి. మరోపక్క నిన్న 41,16,230 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 107 కోట్ల మార్కును దాటింది.