1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (17:21 IST)

శ్రీరాముడు పుట్టిన తేదీ, మహాభారతం ప్రారంభమైన తేదీ ఏంటో తెలుసా?

ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ శ్రీరాముడు పుట్టిన తేదీని కనిపెట్టేసింది. అలాగే మహాభారత యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? అశోక వనంలో సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడు? అనే దానిపై కచ్చితమైన తేదీని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ వెల్లడించింది. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా కనిపెట్టలేని విషయాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా వెల్లడైంది.  
 
శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114, జనవరి 10, 12.05 గంటలకు జన్మించగా... మహాభారతయుద్ధం క్రీస్తు పూర్వం 3139, అక్టోబర్ 13న ప్రారంభమైందని సైంటిఫిక్ రీసెర్చ్‌లో పరిశోధకులు కనుగొన్నారు. అలాగే రావణుడు అపహరించుకుపోయిన సీతాదేవిని అశోకవనంలో హనుమంతుడు క్రీస్తు పూర్వం 5076, సెప్టెంబర్ 12వ తేదీన కలిశాడని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి వెల్లడించింది.
 
ఈ విషయాలన్నింటిని ప్రస్తుతం జరుగుతున్న ‘యునిక్ ఎగ్జిబిషన్ ఆన్ కల్చరల్ కంటిన్యుటీ ఫ్రమ్ రుగ్వేద టు రోబోటిక్స్’లో పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ శ్రీరాముడు, మహాభారతం వంటి చారిత్రక అంశాలకు సంబంధించి ఈ ఎగ్జిబిషన్‌లో ఉంచిన సమాచారానికి మంచి గుర్తింపు లభిస్తోందని తెలిపారు.