మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (17:14 IST)

మనిషి చనిపోయే ముందు దివ్యదృష్టి వస్తుందా...? విశ్వాన్నంతా చూస్తాడా?

మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శరీరాన్ని అయితే అగ్నికి దహనం చేస్తాం. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది. ఆ ఆత్మ ఎన్ని రోజుల పాటు భూమిపై తిరుగాడుతుంది? అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుత

మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శరీరాన్ని అయితే అగ్నికి దహనం చేస్తాం. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది. ఆ ఆత్మ ఎన్ని రోజుల పాటు భూమిపై తిరుగాడుతుంది? అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి. సాధారణంగా మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తుంది. కానీ, ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం.. మనిషి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి వెళుతుందని చెపుతారు. ఇది నిజమా? ఒకవేళ వెళితే ఎలా వెళ్తుంది.? తదితర విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 
 
మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించడం జరిగింది. మరికొద్ది సెకన్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్యదృష్టిలాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే, ఆ సమయంలోనే యమదూతలను చూస్తాడట. 
 
వారు అత్యంత వికారంగా, భీతిగొల్పేలా, నల్లగా, ఆయుధాల వంటి పెద్దపెద్ద గొడ్డళ్ళతో అత్యంత భయంకరంగా కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మలమూత్ర విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరకి ప్రాణం పోతుందట. ఆ ప్రాణాన్ని యమదూతలు నరకానికి తీసుకునివెళ్తారట. యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లేందుకు సుమారు 45 రోజుల సమయం పడుతుందట. 
 
ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలకు గురి చేస్తారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరఢాల వంటి ఆయుధాలతో కొడుతూ యమదూతలు తీసుకెళతారట. దీంతోపాటు నరకంలో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలుకథలుగా చెపుతారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడకు తీసుకెళ్లవద్దని ప్రాధేయపడుతాయట. అయినా యమదూతలు కనికరించరు సరికదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాప, పుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తారట. 
 
చిన్నచిన్న తప్పులు చేసి పశ్చాత్తపపడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడడట. కానీ, దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్షపడే తీరుతుందట. అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారట. అయితే, పాపపుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోమారు భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట. 
 
ఈ క్రమంలో ఆత్మకు చెందినవారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, గరుడ పురాణంలో దీన్ని చెప్పారట. ఈ గరుణ పురాణం చదివితే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.