విష్ణు సహస్రనామ కర్త ఎవరో తెలుసా? స్త్రీలను గౌరవించకపోతే?
విష్ణు సహస్రనామ కర్త ఎవరో తెలుసా..? భీష్మ పితామహుడు. మాఘ శుక్ల ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్ర నామ స్తోత్రం శ్రీకృష్ణునికి వినిపించాడు. అదే రోజునే పరమాత్మలో భీష్ముడు ఐక్యమయ్యాడు. అందుకే మాఘ శుక్ల ఏక
విష్ణు సహస్రనామ కర్త ఎవరో తెలుసా..? భీష్మ పితామహుడు. మాఘ శుక్ల ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్ర నామ స్తోత్రం శ్రీకృష్ణునికి వినిపించాడు. అదే రోజునే పరమాత్మలో భీష్ముడు ఐక్యమయ్యాడు. అందుకే మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్ర నామం. సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే.. దుర్యోధనుడి వైపు భీష్ముడి శరీరం వున్నది. మనస్సంతా అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోయింది.
కానీ ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని అడ్డుకోకపోవడం వల్లే భీష్ముడు అంపశయ్యపై వుండిపోయారు. ఆ పాపం నుంచి దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నట్లు భీష్ముడే స్వయంగా ద్రౌపదితో చెప్పారు. అలాగే అంపశయ్యపై వుంటూ భీష్ముడు స్త్రీలను గౌరవించకపోతే.. ఏం జరుగుతుందో చెప్పారు. స్త్రీని కుటుంబ సభ్యులు సంతోషంగా వుండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏ కుటుంబంలో వుండే స్త్రీలనైనా రక్షించుకోవాలి.
ఏ కుటుంబంలో స్త్రీ సంతోషంగా ఉండదో ఆ కుటుంబం కష్టాల బారిన పడుతుంది. ఇంటి మహిళలే కాకుండా.. ఇతర స్త్రీలను కూడా గౌరవించాలి. లేకుంటే కష్టాలు తప్పవని.. గర్భంతో ఉన్న స్త్రీలకు, పేద కుటుంబంలో ఉన్న మహిళలకు ఎక్కువ గౌరవం ఇవ్వాలి. అవసరమైతే వారిని ఆదుకోవడానికి ప్రయత్నించాలి. వారికి అండగా నిలవాలని భీష్ముడు తెలిపారు.