సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (15:58 IST)

కార్తీక దీపంతో ఆరోగ్యానికి మేలు.. (Video)

దీపంలో ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆవునేతితో వెలిగించిన దీపాల కాంతిని రోజు కనీసం ఒక గంటైనా చిన్న వయస్సు నుంచి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు. నువ్వుల నూనె దీపపు కాంతికిరణాలు రోజ

కార్తీక పౌర్ణమి దీప శ్లోకము- 
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగినః
భవన్తి త్యం శ్వపచాహి విప్రాః ||
 
(అర్థం.. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు, పశువులు, పక్షులు, కీటకములు అన్నీ తమ పాపాలు పోగొట్టుకుని క్షేమంగా ఉండాలి).
 
ఓం || దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం- దీపే సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే || అంటే... దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని విధాలైన చీకట్లను తొలిస్తుంది. దీపారాధన అన్నీ సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నానని పై శ్లోకానికి అర్థం. 
 
దీపంలో ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆవునేతితో వెలిగించిన దీపాల కాంతిని రోజు కనీసం ఒక గంటైనా చిన్న వయస్సు నుంచి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు. నువ్వుల నూనె దీపపు కాంతికిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ల మీద పడితే కంట్లో శుక్లాలు రావు. ఆవు నేయి, నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ల దృష్టి (ఐ సైట్)ని మెరుగుపరుస్తాయి. 
 
అందుకే మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక వుంటుంది. గది మధ్యలో ఆవు నేతితో దీపం వెలిగించి.. హృద్రోగులు, రక్తపోటుతో బాధపడేవారు, ఒత్తిడికి లోనయ్యేవారు రోజు గంటపాటు దీపం దగ్గర కూర్చోగలిగితే.. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని.. బీపీ అదుపులో వుంటుందని ఆయుర్వేదం చెప్తుంది.