1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (14:09 IST)

కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారంటే..?

పసుపును అంతా మంగళకరమైనదిగా భావిస్తుంటారు. అంతే కాకుండా పసుపు క్రిమిసంహారిణిగా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాంటి పసుపును కొత్త బట్టల చివర్లో ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. అనేక సార్లు రూపాంతరాలు చెందిన తరువాత గాని ఒక వస్త్రం బయటికి రాదు. పట్టు, నూలు, ఉన్ని వస్త్రాల తయారీ సమయాల్లో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు వస్త్రంలో కలిసి పోతుంటాయి. ఫలితంగా అవి ధరించిన వారు అనారోగ్యానికి గురవుతూ వుంటారు.
 
ఇక ఇటు అమ్మకపు దారులు ... అటు కొనుగోలు దారుల మధ్య చేతులు మారడం వలన కూడా కొత్తబట్టలకు సూక్ష్మ క్రిములు ఉంటూ వుంటాయి. అలాంటి సూక్ష్మ క్రిముల బారిన పడకుండా వుండటం కోసం నూతన వస్త్రాలకు పసుపు రాస్తూ వుంటారు. ఇక పసుపు లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతున్న కారణంగా, అశుభకార్యాల్లో పెట్టే వస్త్రాలకు మాత్రం పసుపు రాయరు. కొత్త దుస్తులకు మాత్రం పసుపు రాసి కట్టడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు.