సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (12:11 IST)

మాంసాహారం తిని దేవాలయాలకు వెళ్ళొచ్చా...!

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లేముందు మాంసాహారం ముట్టుకోకూడదని పెద్దలు చెపుతుంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట.

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లేముందు మాంసాహారం ముట్టుకోకూడదని పెద్దలు చెపుతుంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసాహారం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం. 
 
మాంసాహారం ద్వారా తీసుకుంటే ఏర్పడే రజోగుణ, తమోగుణాల ప్రభావం వల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా దైవారాధన సఫలం కాదని పెద్దలంటారు. అందుకే మాంసాహారం కంటే.. సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారం తీసుకుని వెళ్ళొచ్చు. కొన్ని అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాంసాహారం ఓకే. 
 
అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి.. అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ. అయితే ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో మాంసాహారం నిషిద్ధం.