శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. కథనం
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:53 IST)

అర్జునుడి కంటే ముందే భగవద్గీత విన్నదెవరో తెలుసా?

మనలో చాలా మందికి భగవద్గీత అనగానే టక్కున శ్రీక్రిష్ణుడు, అర్జునుడి పేర్లే గుర్తుకొస్తాయి. ఎందుకంటే మనకు తెలిసిన పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు భగవద్గీతను అర్జునుడికి మాత్రమే ఒక్కసారే బోధించారని, ఈ విషయం మహాభారతరం గురించి తెలిసిన వారందరూ సులభంగా చెప్పేస్తారు.
 
అయితే భగవద్గీత బోధన అంతకుముందే చాలా సార్లు చేశారట.అత్యంత పవిత్రంగా భావించే గీత బోధనను అర్జునుడి కంటే ముందే క్రిష్ణుడు మరికొందరికి చెప్పాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
 
ఇంతకీ శ్రీక్రిష్ణ భగవానుడు భగవద్గీతను ఎవరెవరికి బోధించారు? ఎప్పుడు బోధించారు.. ఎవరెవరు విన్నారనే ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 
☀️గీత బోధన తొలిసారిగా
పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు అర్జునుడికి భగవద్గీత గురించి బోధిస్తున్నప్పుడు.. ఈ విషయాలన్నీ నీ కంటే ముందే సూర్యదేవునికి తెలుసని చెప్పాడట. సూర్యుడికి తన కంటే ముందే భగవద్గీత గురించి ఎలా తెలుసని క్రిష్ణుడిని అడగగా.. నీకు, నా కంటే ముందే చాలా జన్మలు పూర్తయ్యాయని చెప్పాడు. ఆ జననాల గురించి నీకు తెలియదని, నాకు తెలుసని సమాధానమిచ్చాడు శ్రీక్రిష్ణుడు. ఇలా భగవద్గీత బోధన మొదట అర్జునుడికి కాకుండా సూర్యదేవునికి దక్కింది.
 
☀️వీరికి కూడా గీతా బోధన..
పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని సంజయుడు ద్రుతరాష్ట్రుడికిచ్చాడు. సంజయుడు అతనికి సారథి. ఈయనకు వేద వ్యాసుడు దివ్య ద్రుష్టిని చూసే అవకాశాన్ని కల్పించాడు. దాని సాయంతో గీతా బోధనను ద్రుతరాష్ట్రుడికి వినిపించాడు.
 
బ్రహ్మదేవుడు స్వయంగా.. 
మరో కథనం మేరకు.. వేదవ్యాసుడు మహాభారతం గురించి రచించాలని, మనస్సులో సంకల్పించుకున్నప్పుడు అతి తక్కువ కాలంలోనే తన శిష్యులకు ఎలా వివరించాలి? అని మదనపడుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు స్వయంగా మహర్షి దగ్గరికి వెళ్లి ఈ గ్రంథం కూర్పు గురించి సవివరంగా చెప్పారట.
 
వ్యాసుడు శ్రీగణేశుడికి..
ఈ నేలపై పుట్టిన వారిలో మహాభారతం రచించేందుకు ఎవ్వరికి అర్హత లేదని, కేవలం మీరు మాత్రమే అర్హులని బ్రహ్మ వ్యాసమహర్షికి చెప్పారట. అంతేకాదు ఇందుకోసం శ్రీ గణేశుడిని ఆవాహన చేసుకోవాలని చెప్పారట. మహర్షి వేదవ్యాసుడి ఆదేశాల మేరకు శ్రీగణేశుడి మహాభారత గ్రంథాన్ని రాశారు. ఈ సమయంలోనే వ్యాసుడు శ్రీ గణేశుడికి గీతా బోధన చేశాడు.
 
తన శిష్యులకు.. 
వేద వ్యాసుడు శ్రీగణేషుడితో పాటు తన శిష్యులైన వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితుడికి మహాభారతంలోని లోతైన రహస్యాలను ఉపదేశించాడు. ఈ విధంగా మహా భారతాన్ని తన శిష్యులకు వివరించాడు. ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఘట్టాలను, అధ్యయనాలను లోతుగా విశ్లేషించి వారికి నేర్పించాడు. దీంతో మహాభారతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగారు.
 
ఓ మహర్షికి.. 
పురాణాల ప్రకారం, ఉగ్రశక మహర్షి ఒకసారి నైమిషరణ్యానికి చేరుకుంటారు, ఆ దేశ రాజైన శైనికుడు 12 సంవత్సరాల సత్సంగ్ ను పాటిస్తుంటాడు. ఈ సమయంలో ఉగ్రశ్రవ్య మహర్షి శైనికుడికి మహాభారత గ్రంథం గురించి చెప్పమని అడిగాడు. అప్పటికే వైషాంపయనుడి నోట విన్న శైనికుడు.. ఆ మహార్షి కోరిక మేరకు తనకు వివరించారు. ఈ సమయంలో కూడా ఆయన గీతా బోధన చేసేశారు.
 
ఓ రాజుకు కూడా.. 
పాండవుల వంశస్తుడు అయిన జనమేజయ రాజు తన తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణానికి ప్రతీతకారం తీర్చుకునేందుకు సర్పయజ్ణం చేశాడు. ఈ యాగం పూర్తయిన తర్వాత వ్యాసుడు తన శిష్యులతో ఆ రాజు ఉన్న అంతఃపురానికి వెళ్లారు. తమ పూర్వీకులైన పాండవులు, కౌరవుల గురించి వ్యాసుడిని జనమేజయ రాజు అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి ఆదేశం మేరకు వైషాంయపనుడు ఆ రాజుకి మహాభారతం గురించి వివరించారు. ఈ సమయంలో ఆయనకు భగవద్గీతను బోధించాడు.