కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పార్కింగ్ పనులు పూర్తి: భక్తుల హర్షం!

chitra| Last Updated: మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (12:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రతి సోమ, మంగళ, శని వారాలలో వేలాది వాహనాల్లో భక్తులు కొండగట్టుకు తరలివస్తుంటారు. అక్కడ పార్కింగ్ స్థలాలు లేక ఘాట్ రోడ్డు పైనే తమ వాహనాలను పార్కింగ్ చేయవలసి వచ్చేది. దీంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇతర వాహనాలు రావాలన్నా, వెళ్లాలన్నా, భక్తుల రాకపోకలకు ఎన్నోఇబ్బందులు ఉండేది.

ఇక వై జంక్షన్ వద్ద చెప్పరాని పరిస్థితి ఉండేది. పూజలకు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులతో వై జంక్షన్ ట్రాఫిక్‌తో నిండిపోయేది. అంతేకాక కొండగట్టులో భక్తులకు నివసించేందుకు వసతులు లేక, నీటి సమస్యలతో పాటు వాహనాలు నిలుపడం కూడ ఎంతో ఇబ్బందికరంగా ఉండేది.

ఇప్పుడా సమస్య పూర్తిగా తొలగిపోయింది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ వాహనాలు నిలుపుకొనేందుకు ఆలయ అధికారులు రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. కొండగట్టులో భక్తులకు నివసించేందుకు వసతులు లేక, నీటి సమస్యలతో పాటు వాహనాలు నిలుపడం కూడ ఎంతో ఇబ్బందికరంగా ఉండేది.

కొండగట్టుకు వేలాది వాహనాలల్లో తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఆలయ ఆవరణలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. గుట్ట మీద వాహన పూజలు చేసే పక్కన, వై జంక్షన్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా కిందికి దిగే ప్రదేశంలో నీటి ట్యాంకుల పక్కన ఖాళీ స్థలాలను బండరాళ్లు, చెట్లు లేకుండా తొలగించి పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. పార్కింగ్ స్థలాల ఏర్పాటు కొన్ని నెలలుగా సాగుతున్నా మంగళవారానికి పూర్తి కావడంతో భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :