Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వెంకన్నకు స్వర్ణ కిరీటం, పాదపద్మములు

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టో

Written By selvi
Updated: మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:18 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. 
 
సోమవారం శ్రీవారిని 75,819 మంది దర్శించుకున్నారు. 29,794 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.08 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని వారు చెప్పారు.
 
మరోవైపు కలియుగ దైవం తిరుమల వేంకటేశునికి ఓ భక్తుడు రూ.28 లక్షల విలువైన స్వర్ణ కిరీటం, రూ. 2 లక్షల విలువైన పాదపద్మములను బహూకరించాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియత్తానికి చెందిన కె.దొరస్వామి దంపతులు శ్రీవారి భక్తులు. 
 
సోమవారం స్వామి వారిని దర్శించుకున్న వీరు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను కలిసి స్వర్ణ కిరీటం, 1600 గ్రాముల బరువుగల రెండు పాదపద్మములను బహూకరించారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments