గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (21:43 IST)

అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు అక్టోబరు 22 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో  విడుదల చేస్తారు.

అయితే డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ  ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8 మరియు 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు.

 
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

 
భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.