శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 డిశెంబరు 2024 (22:45 IST)

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

Reliance Industries CEO Sri PMS Prasad
కర్టెసి-తితిదే
తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ శ్రీ పి.ఎం.ఎస్‌.ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరికి అందజేశారు.
 
Surya Pawan Kumar donation
అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం
తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన శ్రీ సూర్య ప‌వ‌న్ కుమార్ అనే భ‌క్తుడు సోమ‌వారం టీటీడీ అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేర‌కు తిరుపతి లో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి డీడీని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌ను ఈవో, అద‌న‌పు ఈవో అభినందించారు.