సంబంధిత వార్తలు
- Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం
- తిరుమల, రెండో ఘాట్ రోడ్డు.. సుమో వాహనంలో నిప్పులు
- రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)
- Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
- జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్
టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం
Old Notes
భక్తులు తమ వద్ద ఉండిపోయిన లేదా మరిచిపోయిన ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.
మరోవైపు ఇటీవలే చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. రూ.2వేల నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండటంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేస్తోంది.
కానీ రూ.500, రూ.1000ల నోట్లు కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి, టీటీడీ వద్ద వున్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి.
