సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (15:45 IST)

శ్రీవారి భక్తులకు తితిదే శుభవారం - రాకపోకలకు 2వ ఘాట్ రోడ్డు

శ్రీవారి భక్తుల తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. గత యేడాది ఆఖరులో చిత్తూరు జిల్లాలో విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో కనుమ రహదారి తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీంతో ఈ రెండో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 
 
అయితే, ప్రస్తుతం మార్గంలో వాహనరాకపోకలకు తితిదే అనుమతి ఇచ్చింది. పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు తితిదే ఈవో ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దీనిపై శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత యేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా డిసెంబరు 1వ తేదీన 16 కిలోమీటరు వద్ద కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబు 4వ తేదీ వరకు మొదటి ఘాట్ రోడ్డులోనే రెండు వైపులా రాకపోకలను అనుమతిస్తూ వచ్చారు. 
 
అయితే, డిసెంబరు 5వ తేదీ నుంచి రెండో ఘాట్ రోడ్డులో వాహనాలను లింకు రోడ్డు మీదుగా మళ్లించారు. లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించడంతో ప్రయాణ సమయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దెబ్బతిన్న మార్గంలో 80 శాతం మేరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తికావడంతో వాహనాలను అనుమచింతారు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతిస్తామని తితిదే అధికారులు వెల్లడించారు.