శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 25 నవంబరు 2021 (23:09 IST)

భక్తులు త్వరపడండి, డిసెంబర్ నెలకు సంబంధించిన టోకెన్లు ఈ నెలలో రిలీజ్.. ఎప్పుడంటే?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్సనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన నిర్దేశిత సర్వదర్సనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

 
అలాగే తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్సనం టోకెన్లు తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 
కోవిడ్ కారణంగా ఇప్పటికే ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని టిటిడి నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా కూడా టోకెన్లను మాత్రం టిటిడి ఆన్ లైన్ ద్వారానే ఇస్తోంది.

 
సర్వదర్సన ఉచిత టోకెన్లు, 300 రూపాయల శీఘ్రదర్సనం టోకెన్లు రెండు కూడా ఇదే విధంగా టిటిడి మంజూరు చేస్తోంది. అయితే ఆన్లైన్లో విడుదల చేసిన 30, 40 నిమిషాల్లోనే టోకెన్లన్నీ అయిపోవడం మాత్రం భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినబడుతోంది.