బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 24 జనవరి 2018 (17:59 IST)

45 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం.. తిరుమల గిరులు ఖాళీ...

తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే

తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు లభిస్తోంది. అయితే రథసప్తమి జరుగుతున్నా భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో త్వరితగతిన శ్రీవారి దర్సనం లభించడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
సాధారణంగా రథసప్తమి నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంటుంది. కిక్కిరిసిన జనం శ్రీవారి వాహన సేవలో పాల్గొని ఆ తరువాత స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం భక్తుల రద్దీ పెద్దగా కనిపించ లేదు. స్వామివారి దర్శనం అయిన భక్తులే ఎక్కువగా వాహన సేవలో కనిపించారు. వాహన సేవలను తిలకించిన తరువాత నేరుగా గమ్యస్థానాలకు భక్తులు బయలుదేరి వెళ్ళారు. దీంతో తిరుమలలో రద్దీ కనిపించలేదు. గత మూడు నెలల తరువాత 45 నిమిషాల్లో శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది.