Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక రోజు పగలంతా మూసివేయనున్నారు. దీనికి కారణం చంద్రగ్రహణమే. ఈనెల 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Written By pnr
Updated: మంగళవారం, 30 జనవరి 2018 (11:10 IST)
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక రోజు పగలంతా మూసివేయనున్నారు. దీనికి కారణం చంద్రగ్రహణమే. ఈనెల 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. దీంతో ఆ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేస్తున్నట్లు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నదని, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. 
 
ఆ తర్వాత రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదని తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామన్నారు.
 
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశామన్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్‌ను ఆశ్రయించిన కోడలు

కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా?

భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో

Eco-Friendly: నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహం.. విశేషాలు ఏంటంటే?

అన్నీ చూడండి

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు

11-09-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ఆరోగ్యంపై శ్రద్ధ.. విశ్రాంతి అవసరం..

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి

తర్వాతి కథనం
Show comments