గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జులై 2023 (19:26 IST)

ఈ ఏడాది ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు- టీటీడీ ప్రకటన

శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. అధికమాసం సందర్భంగా ఈసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఒకేసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. రెండుస్లారు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. 
 
బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వెల్లడించారు.