మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (09:43 IST)

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 17 నుంచి తిరుప్పావై

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి తిరుప్పావైని నివేదిస్తారు. శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావైని నివేదిస్తారు. 
 
ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. శ్రీవారికి తిరుప్పావై సేవ 17 నుంచి ప్రారంభిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. 
 
ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.