ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2023 (23:35 IST)

బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?

Love
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ ఇద్దరి మధ్య ఎంతో నమ్మకంతో పెనవేసుకుంటుంది. కానీ ఈ ప్రేమబంధంలో అనుమానానికి బీజం పడిందంటే ఇక బ్రేకప్ ఖాయం. ఐతే ఇలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత విపరీతంగా బాధపడేది ఎవరు? అమ్మాయా.. అబ్బాయా? తెలుసుకుందాము. బ్రేకప్ తీసుకున్న అబ్బాయిలు-అమ్మాయిలులో ఎవరు ఎక్కువ బాధపడుతున్నారో బ్రిటన్‌కు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేసారు.
ఈ అధ్యయనంలో సుమారు లక్షా ఎనభై నాలుగువేల మంది ప్రేమలో విఫలమైనవారిని ఎంచుకున్నారు.
 
ఈ అధ్యయనంలో బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే బాధపడుతున్నట్లు తేలింది.
ఈ బాధను అమ్మాయిలు తమ స్నేహితులతో పంచుకుంటారు కానీ అబ్బాయిలు చెప్పుకోరట.
బ్రేకప్ బాధను అబ్బాయిలు తమలో తామే అనుభవిస్తూ తమ ప్రేయసిని తలుచుకుంటారని తేలింది.
 
ముఖ్యంగా ఇద్దరి మధ్య నమ్మకం లేక సగానికి పైగా జంటలు విడిపోతున్నట్లు తెలిపారు.
తమ ప్రియురాలు మరో అబ్బాయితో వెళ్తుందేమోనన్న అనుమానంతో కొందరు చెప్పారు.
బ్రేకప్ అయ్యాక మరికొందరు మానసిక ఒత్తిడిలోకి వెళ్లినట్లు కూడా చెప్పుకున్నారు.
 
మొత్తమ్మీద బ్రేకప్ తీసుకున్నాక అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధ పడుతున్నారని ఈ సర్వే తెలిపింది.