పగడపు దీవులు కూడా ఉంటాయి!

Beach
FILE
అండమాన్ నికోబార్ దీవులలో ముఖ్యంగా చూడదగ్గవాటిలో ఆ దేశ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లోగల సెల్యూలార్ జైలు, దాని సమీపంలోని చిన్న ద్వీపం చాతమ్, మినీ జూ, ఆంత్రోపాలాజికల్ మ్యూజియం, ఆక్వేరియం, సముద్రిక (నావెల్ మెరైన్ మ్యూజియం), జ్సి మ్యూజియం, ఫారెస్ట్ మ్యూజియం..లే గాక మరెన్నో ఉన్నాయి.

ఈ దీవులకు ఎలా వెళ్లాలంటే..? అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ విమానాశ్రయానికి.. కోల్‌కతా, చెన్నైల నుంచి రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ఉన్నాయి. విమానంలో రెండు గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే ఇండియన్ ఎయిర్‌లైన్స్, రెండు ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లు కూడా వారానికి రెండుసార్లు ఈ ప్రాంతానికి విమాన సర్వీసులను నడుపుతున్నారు.

సముద్ర మార్గంలో అయితే.. కోల్‌కతా, చెన్నై, విశాఖపట్ణణం నుంచి ఈ దీవులకు నౌకలు వెళ్తుంటాయి. చెన్నై, కోల్‌కతా నుంచి నెలకు 4సార్లు.. విశాఖపట్నం నుంచి నెలకు ఒకసారి నౌకలు బయలుదేరుతాయి. అయితే ఇక్కడికి చేరుకునేందుకు చెన్నై నుంచి 60 గంటల ప్రయాణం కాగా, కోల్‌కతా నుంచి 66, విశాఖపట్నం నుంచి 56 గంటలు పడుతుంది. సముద్ర మార్గంలో వెళ్లాలంటే నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందుగా మాత్రమే టిక్కెట్లు ఇస్తారు.

చూసేందుకు ఎంతో అందంగా ఉండే అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాలంటే మాత్రం అంత సులభమైన విషయమేమీ కాదు. అక్కడి పోర్ట్‌బ్లెయిర్ మినహాయిస్తే మిగిలిన దీవులలో తాగునీరు, టాయిలెట్ల లాంటి సౌకర్యాలు కూడా ఉండవు. అందుకే ఈ దీవులకు వెళ్లాలనుకుంటే ముందుగానే నౌకలు, లేదా విమానాలలో టికెట్లను రిజర్వ్ చేయించుకోవాలి.

ఇక ఇక్కడికి వెళ్లదలచుకునేవారు రెండు అంతకంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే అక్కడి వివిధ దీవులను కూడా చూడాలనుకుంటే బోట్స్ సమయానికి అందుబాటులో ఉండవు. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీరు తీసుకెళ్లటం మంచిది. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా, గుంపుగా వెళ్లటం ఉత్తమం.

Ganesh|
ఎందుకంటే.. అండమాన్ నికోబార్ దీవులలో నివసించే ట్రైబల్ ప్రజలకు కొత్త జాతులవారంటే అస్సలు గిట్టదు. ఏ మాత్రం మనం జాగ్రత్తగా ఉండకపోతే వారి విషం పూసిన బాణాల దెబ్బలను రుచి చూడాల్సి ఉంటుంది. పరాకుగా ఉండే పర్యాటకులను వాళ్లు చంపిన ఉదంతాలు సైతం లేకపోలేదు కాబట్టి బీ కేర్ ఫుల్. ఇలాంటి తంటాలేమీ అవసరం లేదనుకుంటే ఎంచక్కా బీచ్‌లు, పార్కులను సందర్శిస్తే సరిపోతుంది.దీనిపై మరింత చదవండి :