స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇరాక్ దేశానికి చెందిన అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై మిలిటెంట్లు దాడిచేసిన నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 114 డాలర్లకు పెరిగింది.
దీనికితోడు ఆసియా మార్కెట్లన్నీ నిరాశగా ట్రేడ్ కావడంతో వాటి ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్లాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 25,314కు పడిపోయింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 7,569 దగ్గర క్లోజ్ అయింది.
ఈ ట్రేడింగ్‌లో ఇంజినీర్స్ ఇండియా, నేషనల్ అల్యూమినియం కంపెనీ, అశోక్ లేల్యాండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఆర్బీ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా, ఎస్ బ్యాంక్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐడియా సెల్యులార్, సుజ్లాన్ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.