శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 జులై 2020 (21:15 IST)

ఫుల్ జోష్‌లో మార్కెట్లు, 10 వేల మార్కు పైనే నిలిచిన నిఫ్టీ

ఆర్థిక మరియు ఎఫ్‌ఎంసిజి రంగం నేతృత్వంలోని నేటి ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ 10 వేల మార్కు పైన నిలిచి ఉండగా, 1.24% లేదా 127.95 పాయింట్లు పెరిగి 10,430.05 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.43% లేదా 498.65 పాయింట్లు పెరిగి 35,414.45 వద్ద ముగిసింది. సుమారు 1486 షేర్లు పెరిగాయి, 120 షేర్లు మారలేదు, 1251 షేర్లు క్షీణించాయి.
 
టాప్ నిఫ్టీ లాభదారులలో యాక్సిస్ బ్యాంక్ (6.34%), బజాజ్ ఫిన్సర్వ్ (5.20%), యుపిఎల్ (5.27%), హెచ్‌డిఎఫ్‌సి (1.28%), ఐటిసి (4.65%) ఉన్నాయి. ప్రముఖంగా నష్టపోయిన వారిలో, నెస్లే (2.06%), ఎన్‌టిపిసి (2.14%), శ్రీ సిమెంట్స్ (1.96%), ఎల్ అండ్ టి (1.99%), సిప్లా (1.88%) ఉన్నాయి. ఫార్మా రంగం ఒత్తిడిలోనే కొనసాగింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ వరుసగా 0.18%, 0.39% పెరిగాయి.
 
హీరో మోటోకార్ప్
గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల నుండి పెద్ద డిమాండ్ రావడంతో, కంపెనీ మొత్తం అమ్మకాలు 4.5 లక్షలుగా ఉన్న తరువాత, నేటి సెషన్లో, హీరో మోటోకార్ప్ స్టాక్స్ 0.12% తగ్గి రూ. 2544.00ల వద్ద ట్రేడ్ అయింది
 
అతుల్ ఆటో
జూన్ నెలలో కంపెనీ అమ్మకాలు 71.8% తగ్గిన తరువాత, అతుల్ ఆటో స్టాక్స్ 0.95% పెరిగి రూ. 167.70ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
సుజ్లాన్ ఎనర్జీ
విండ్ టర్బైన్ తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ తన ఋణ పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది మరియు దాని ఋణంపై ఇప్పుడు సంవత్సరానికి 9% వడ్డీని చెల్లిస్తుందని తెలిపింది. తత్ఫతంగా కంపెనీ షేర్లు 4.95% పెరిగి రూ. 5.30 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
ఎం అండ్ ఎం
ఎం అండ్ ఎమ్ యొక్క ప్రయాణీకుల వాహనాల విభాగం గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలతో పోలిస్తే. 2020 జూన్ నెలలో 8,000 వాహనాలను విక్రయించింది. ఎం అండ్ ఎం షేర్లు 1.64% తగ్గి రూ. 502,30ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
అలెంబిక్ ఫార్మా
యు.ఎస్.ఎఫ్.డి.ఎ నుండి దాని ఎ.ఎన్.డి.ఎ డాక్సీసైక్లిన్ హైక్లేట్ టాబ్లెట్ కోసం తుది ఆమోదం పొందినప్పటికీ, అలెంబిక్ ఫార్మా స్టాక్స్ 0.74% తగ్గి రూ. 906.00 ల వద్ద ట్రేడ్ అయింది 
 
ఐషర్ మోటార్స్
జూన్ నెలలో ఐషర్ మోటార్స్ అమ్మకాలు 70.3% తగ్గాయి. కంపెనీ స్టాక్ ధర 0.17% పెరిగి రూ. 18,365.00 ల వద్ద ట్రేడ్ అయింది.
 
గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్
జెనెరిక్ ఔషధాల ధరను నిర్ణయించడానికి కుట్ర పన్నినందుకు కంపెనీపై అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపిన తరువాత, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు 3.62% తగ్గి రూ. 434.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
నేటి సెషన్ లో, ఆర్‌ఐఎల్ యొక్క స్టాక్స్ 1.89% పెరిగాయి మరియు ఇంట్రాడే గరిష్టాన్ని మరియు కనిష్టాన్ని వరుసగా రూ. 1727.9 లు మరియు రూ. 1712.65 ల వద్ద తాకి, రూ. 1736.25 ల వద్ద ట్రేడ్ అయింది. 
 
భారతీయ రూపాయి
నేటి ట్రేడింగ్ సెషన్‌లో సానుకూల ఈక్విటీ మార్కెట్ నడుమ, యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం, స్వల్పంగా రూ. 75.59 ల వద్ద ముగిసింది.
 
బంగారం
పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ప్రపంచ అనిశ్చితి పెరుగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం పెరిగాయి. ఈ సంవత్సరం బంగారం ధరలు సుమారు 24% పెరిగాయి.
 
మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు
పెరుగుతున్న భారతదేశం-చైనా ఉద్రిక్తత మరియు పెరుగుతున్న కొరోనావైరస్ కేసుల నడుమ నేటి ట్రేడింగ్ సెషన్లో ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నాస్‌డాక్ 1.87%, హాంగ్ సెంగ్ 0.52% పెరిగాయి. మరోవైపు, నిక్కీ 225 0.75%, ఎఫ్‌టిఎస్‌ఇ 100 1.33%, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.82% తగ్గాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్