శుక్రవారం, 16 జనవరి 2026
  1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్
Written By PNR
Last Updated : గురువారం, 29 మే 2014 (17:02 IST)

322 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీగా నష్టపోయింది. పెట్టుబడిదారులు విక్రయాలకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 322 పాయింట్ల మేరకు పతనమై 24,234 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 7,236కు దిగజారింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, మీడియా కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
 
ఈ ట్రేడింగ్‌లో అమరరాజా బ్యాటరీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, యూకో బ్యాంక్, పిపావావ్ డిఫెన్స్, ఫ్యూచర్ రీటెయిల్ వంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించగా, ఇన్ఫోసిస్, వోక్ హార్డ్ లిమిటెడ్, నైవేలీ లిగ్నైట్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.