శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2016 (17:43 IST)

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు... తగ్గిన బంగారం ధరలు

బాంబే స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 267 పాయింట్లు లాభపడి 23,649 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్జ్చేంజ్‌ నిఫ్టీ 83 పాయింట్లు ఎగబాకి 7,191 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.45 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, కెయిర్న్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌ తదితర షేర్లు లాభాలు పొందాయి. మారుతి, ఆసియన్‌ పెయింట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.
 
ఇదిలావుండగా, ప్రపంచ మార్కెట్ల ప్రభావం, వ్యాపారస్తుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో పదిగ్రాముల పసిడి ధర రూ.28,750కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,205.90 డాలర్లుగా ఉంది. మరో వైపు వెండి ధర మాత్రం గురువారం స్థిరంగా ఉంది. వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో వెండి ధర యధాతథంగా రూ.37,100 వద్ద ఉంది.