గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (16:37 IST)

ఆరో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్-10వేల మార్కు వద్ద ముగిసిన నిఫ్టీ

బాంబే స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఆరవ రోజు లాభాల్లో ముగిసింది. సెనెక్స్‌ 284 పాయింట్ల లాభంతో 34,109.54 వద్ద, నిప్టీ 82 పాయింట్లు పెరిగి 10,061 పాయింట్ల ముగిసింది. లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతుందనే ఆశావహన అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. 
 
దేశీయ మార్కెట్లు లాభపడటంతో బ్యాంక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్ల అండతో సూచీలు దూసుకెళ్లాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో భారీ లాభాలకు అవకాశం లేకుండా పోయింది. నిఫ్టీ తిరిగి 10 వేల మార్కును అందుకుంది.
 
ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ఆద్యంతం లాభాలను ఆర్జించింది. ఒకానొక సమయంలో దాదాపు 600 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఇకపోతే.. నిఫ్టీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే షేర్లు ప్రధానంగా లాభాలు చవిచూశాయి. ఎన్టీపీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాపోయాయి.