సెరీనా విలియమ్స్ ఓటమికి ప్రేమే కారణమా.. ఫ్యాన్స్ అనేది నిజమా?

Selvi| Last Updated: శనివారం, 12 సెప్టెంబరు 2015 (13:06 IST)
టెన్నిస్‌లో రారాణిగా వెలుగొందుతున్న అమెరికా నల్ల కలువ సెరీనా విలియమ్స్ అనూహ్యంగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో పరాజయం పాలవడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అత్యంత అరుదైన గ్రాండ్ స్లామ్‌ కలను సెరీనా విలియమ్స్ చేజార్చుకోవడానికి.. ఆమె ప్రియుడు డ్రేక్‌ కారణమని అంటున్నారు. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మరో రెండు మ్యాచ్‌ల్ని కూడా సెరీనా గెలుచుకుంటుందని.. తద్వారా గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు.

కానీ సెమీఫైనల్ మ్యాచ్‌లోనే అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన విన్సీ చేతిలో ఖంగుతింది. ఆద్యంతం గట్టిపోటీనిచ్చిన విన్సీ చేతిలో 2-6, 6-4, 6-4 స్కోరుతో సెరెనా ఓటమి పాలైంది. తద్వారా ఈ టోర్నీ నుంచి సెరీనా నిష్క్రమించింది. సెరీనా ఇలా సెమీఫైనల్‌తోనే ఇంటిదారి పట్టడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. డ్రేక్ వల్లే ఇదంతా జరిగిందనే విధంగా ఫ్యాన్స్ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇకపోతే.. ఈ కేలండర్ ఇయర్‌లో ఇయర్‌లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న సెరెనా, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఉంటే, ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించేది. అంతేగాకుండా 27 సంవత్సరాలుగా సాధ్యం కానీ ఫీట్‌ను కూడా తన పేరిట నమోదు చేసుకునేదే. కానీ యూఎస్ ఓపెన్ సెమీస్‌ ఓటమితో సెరీనా గ్రాండ్ స్లామ్ కల చెదిరిందని.. ఆమె ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.దీనిపై మరింత చదవండి :