శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (22:48 IST)

ఆసియా క్రీడలు.. 100కి పైగా దాటిన భారత్ పతకాలు

Asia Games 10th Gold for India
ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రస్థానాన్ని గెలుపుతో ముగించింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 100కి పైగా దాటింది. హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రీడోత్సవాల్లో భారత్ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు సాధించింది. 
 
2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించగా, ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో అదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఇప్పుడు ఏకంగా 100 పతకాల మార్కు దాటడం విశేషం.  బ్యాడ్మింటన్ లో తొలిసారి స్వర్ణం సాధించడం హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లోనే సాధ్యమైంది. ఆసియా క్రీడల క్రికెట్లో పురుషుల, మహిళల విభాగం రెండింట్లోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి.