శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:14 IST)

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినా ఆ క్రీడాకారుడికి విషాదమే మిగిలింది?

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధ

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి  తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.


ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పంజాబ్‌కు చెందిన తేజిందర్ పాల్‌సింగ్‌కు జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందనే వార్త వచ్చింది. 
 
తన తండ్రి ఇక లేడన్న విషయం ఇంటికి సమీపంలో చేరుతుండగా వచ్చిందని తేజిందర్ తెలిపాడు. తాను బంగారు పతకం సాధిస్తే చూడాలనేది తండ్రి కోరిక అని, ప్రస్తుతం ఆ పతకంతో వచ్చినా ఆయన చూడలేకపోయారని తేజిందర్ విలపించాడు.

తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. పంజాబ్‌లోని స్వగ్రామం మోగాలో ఆయన తుదిశ్వాస విడిచారు.