మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:23 IST)

ఆసియా క్రీడలు.. పతకాల పంట పండిస్తున్న భారత్ క్రీడాకారులు

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్ సత్తా చాటింది. బుధవారం అథ్లెట్లు రెండు పసిడి పతకాలు నెగ్గడంతో క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ సింగ్, మహిళల హెప్టాథ్

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్ సత్తా చాటింది. బుధవారం అథ్లెట్లు రెండు పసిడి పతకాలు నెగ్గడంతో క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ సింగ్, మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్‌ బంగారు పతకాలు సాధించారు.


ఏషియాడ్‌లో 48 ఏళ్లలో స్వర్ణం నెగ్గిన భారత తొలి ట్రిపుల్‌ జంపర్‌గా అర్పిందర్‌ నిలిస్తే.. హెఫ్టాథ్లాన్‌ స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా స్వప్న రికార్డు సృష్టించింది. వంద మీటర్లలో రజతం గెలిచిన ద్యుతి చంద్‌ 200మీ పరుగులోనూ అదరొట్టింది. 
 
ఇక టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌-మనిక బత్రా జోడీ కాంస్యం గెలిచింది. ఏషియాడ్‌ టీటీలో భారత్‌కు ఇదే తొలి మిక్స్‌డ్‌ పతకం కావడం గమనార్హం. మహిళల హాకీ జట్టు ఫైనల్‌ చేరి కనీసం రజతం ఖాయం చేసింది. మరో నాలుగు పతకాలు కూడా ఖాయమయ్యాయి. భారత్‌ 11 స్వర్ణాలు సహా మొత్తం 54 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
 
అథ్లెటిక్స్‌లో నాలుగో స్వర్ణం భారత్‌ సొంతమైంది. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ సింగ్‌ స్వర్ణంతో మెరిశాడు. 16.77 మీటర్లతో విజేతగా నిలిచిన అతడు.. 48 ఏళ్లలో ఏషియాడ్‌ ట్రిపుల్‌ జంప్‌ పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.