బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:18 IST)

ప్చ్... రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి స్వర్ణం సాధించాలన్న ఆమె కల... ఓ కలగానే మిగిలిపోయింది.
 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా ఆదివారం కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-10 తేడాతో ఓడిపోయింది. మొదటి గేమ్‌లో సింధు పోరాటపటిమతో చాలా శ్రమించిన మారిన్ రెండో గేమ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి దూకుడు ముందు సింధు నిలబడలేక పోయింది. 
 
ఫలితంగా కరోలినా మారిన్ 21-19, 21-10 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి, స్వర్ణ పతకం సొంతం చేసుకుని, ఛాంపియన్‌గా నిలిచింది. వరల్డ్ మూడో ర్యాంకర్ సింధు గత ఏడాదిలాగే ఈ సారి కూడా రజత పతకంతో సరిపెట్టుకుంది.